రాజకీయం

నేటి నుండే ‘రైతుబంధు’ నిధుల విడుదల

250 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 12)

రాష్ట్రంలోని రైతులందరికీ ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి డా. బీ. ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా సి.ఎం. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు నేటినుండే ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో వేసే ప్రక్రిను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సహాయం అందించాలని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *