24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 15)
రామలింగేశ్వర స్వామి పూజలో పాల్గొన్న ఎఫ్డీసీ మాజీ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
తూప్రాన్:- తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ శివారులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ జాతర ఉత్సవాల్లో ఎఫ్డీసీ మాజీ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని శ్రీ రామలింగేశ్వర స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి సురేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సుకన్య రమేష్, జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి, నాయకులు రాజు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
