ప్రాంతీయం

289వ అనాధ శవానికి దహన సంస్కారం చేసిన డాక్టర్ కల్వరి కుమార్

28 Views

289వ అనాధ శవానికి దహన సంస్కారం చేసిన డాక్టర్ కల్వరి కుమార్.

“289” వ అనాధ శవానికి “దహన సంస్కారం “లు చేసి వారి పెద్ద కొడుకుగా భాద్యతలు నిర్వహించిన “డాక్టర్.కల్వరి కుమార్ ”
వివరాలు. మంచిర్యాల జిల్లా ఆసుపత్రి లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న అనాధ వృద్దురాలు, వచ్చిపోయే పేసెంట్స్ కు ఇబ్బందికరంగా ఉన్నది అని హాస్పిటల్ డాక్టర్. శ్రీమన్నారాయణ ఆర్ యం ఓ  ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా మా అనాధ ఆశ్రమం నకు లెటర్ ఇచ్చి మేము నిర్వహిస్తున్న “కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమలో తేది :21.12.2024 రోజున చేర్పించ్చినారు. అప్పటి నుండి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతూ ఈ రోజు అనగా తేదీ :05.12.2025 రోజున మధ్యాహ్నం అందదా 12:30 గంటలకు చినిపోయింది. అట్టి విషయాన్ని ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. కల్వరి కుమార్ అలియాస్ డాక్టర్. ములుకాల కుమార్ ఆసుపత్రి
ఆర్. యం ఓ డాక్టర్ శ్రీమన్నారాయణ కి తెలియజేసినారు అనంతరం ఆర్ యం ఓ సూచన మేరకు మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్డు లో ఉన్నటువంటి మహాప్రస్థానంలో, ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ములుకాల కుమార్ ఆ అమ్మ కు పెద్ద కొడుకు అయి తలకొరువు పెట్టినాడు అనంతరం కుమార్ మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు ఈ అమ్మ తో కలిపి “289” మృతిదేహాలకు సొంత ఖర్చులతో దహన సంస్కారం (అత్యక్రియలు) చేయడం జరిగింది.దయచేసి మా ఆశ్రమం లో అనాధ వృద్ధులను, మతిస్థిమితం సరిగ్గా లేని వారిని అనాధ ఆశ్రమం లో చేర్పిస్తున్నారు. కానీ చేర్పించిన వారు కనీసం ఒక్క పూట భోజనం కూడా పెట్టడం లేదు, కనీసం వారు చేర్పించిన వ్యక్తి చనిపోతే కూడా దహన సంస్కారం ల కోసం కూడా ఒక్క రూపాయి కూడా మాకు సహాయం చేయడం లేదు దయచేసి మేము చేస్తున్న సేవ కార్యక్రమం లను గుర్తించి మాకు నగదు రూపంలో కానీ, వస్తువు రూపంలో కానీ మీరు మాకు మీ సహాయ సహకారం లు అందించగలని వేడుకుంటున్నాను.

ఈ కార్యక్రమం లో నా తోటి ఆర్. యం. పీ సహోదరుడు డాక్టర్. బూర్ల గణేష్, ఆశ్రమ సభ్యులు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *