ప్రాంతీయం

బెహరాన్ రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జెడ్ పి టి సి

87 Views

ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 05 :

ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామానికి చెందిన మోకనపల్లి సుమన్ (26 ) అనే యువకుడు రోడ్డు ప్రమాదం లో సెప్టెంబర్ 01 వ తేదీ నా మరణించాడు,
బ్రతుకు తెరువు కోసం 8 నెలల క్రితం బెహరాన్ కు వెళ్ళి శెవపేటీకతో సోమవారం ఒకరి సహాయం తో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలోని తన ఇళ్ళు చేరడంతో ఒక్కగానొక్క కొడుకు ను కోల్పోయిన తల్లి దండ్రులు సుమన్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు తల్లడిల్లి పోయారు,
శోకసముద్రమైన కోరుట్ల పేటలోని స్మశానవాటిక లో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు ,
ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఆ బాదితకుటుంబాన్ని మంగళవారం వెళ్లి పరామర్శించారు, కన్నీటిపర్యంతమైన సుమన్ తల్లి నర్సవ్వ, తండ్రి నర్సయ్య లను ఓదార్చారు, ఈ సందర్భంగా వారికి ఖర్చులు నిమిత్తం 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు అందజేశారు,
బెహరాన్ లో రోడ్డు ప్రమాదంలో మరణించినందున అక్కడి కంపెనీ అధికారులతో మాట్లాడి లాయర్ ల న్యాయ సలహాతీసుకొని ఆర్థీక సహాయం అచ్చే విధంగా చూస్తానని అన్నారు ,
బాధిత కుటుంబాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, స్థానిక ఎంపిటీసీ సభ్యులు సింగారం మధు, ఎఎంసి మాజీ చైర్మన్ అందె సుభాష్, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, కోరుట్ల పేట గ్రామ శాఖ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బాలమల్లు , బిఆర్ ఎస్ పార్టీ నాయకులు పిల్లి కిషన్, సురభి కాంతారావు, ప్రమోద్,కాంపెల్లి కిష్టయ్య , రామాగౌడ్ లు వెళ్లి పరామర్శించారు,

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *