రాజన్న సిరిసిల్ల ఐడిఓసి కాన్ఫరెన్స్ హల్ లో జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రామీణభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, పంచాయితీ రాజ్, మిషన్ భగీరథ, సెస్, రహదారులు, భవనాలు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాలు, ఇరిగేషన్ తదితర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ ప్రగతి నివేదికను సభ్యుల ముందు ఉంచారు. సభ్యులు పలు అంశాలను లేవనెత్తగా వాటికి అధికారులు వివరణ ఇచ్చారు.
జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో దసరా పండుగ కానుకగా ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం కార్యక్రమానికి ప్రభుత్వo శ్రీకారం చుడుతుందన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య అధికారులను ఆదేశించారు.
