సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా, జనవరి 5, 2026:
వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు సబ్ స్టేషన్ ఏర్పాటు కొరకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలం రాపల్లి ప్రాంతంలో సబ్ స్టేషన్ ఏర్పాటు కొరకు మండల తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





