ప్రకటనలు

కేంద్ర పథకాల చేరవేయాలన్నదే వికసిత్ సంకల్ప యాత్ర ఉద్దేశ్యం:కేంద్ర టెక్స్టైల్ మంత్రి

159 Views

అర్హులకు సంతృప్త స్థాయిలో కేంద్ర పథకాల చేరవేతకు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమంకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, వికసిత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి అజయ్ గుప్తా అన్నారు.

ప్రతి పథకాన్నీ అర్హతే ప్రామాణికంగా, వివక్షకు తావు లేకుండా సంతృప్త స్థాయిలో అందిస్తోందనీ జిల్లాలోని అర్హులందరూ ప్రభుత్వ పథకాల ఫలాలను పొందాలన్నారు

ఈ సందర్భంగా కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, వికసిత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి అజయ్ గుప్తా మాట్లాడుతూ…యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా ఎంతమందికి ప్రయోజనం కలిగింది.. ఇంకా ఎంత మంది అర్హులు ఉన్నారో తెలుసుకోవడమే ఈ యాత్ర ముఖ్యోద్దేశమన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల చిట్ట చివరి లబ్ధిదారుడికి కేంద్రం అమలు చేస్తున్న పథకాల లబ్ధి చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. వ్యవసాయంలో నానో టెక్నాలజీ కి పెద్ద పీట వేయలన్నారు. నానో యూరియా తో పంట దిగుబడి పెరగడమే కాకుండా , భూమి, వాతావరణం కాలుష్యం కాకుండా చూడవచ్చున్నారు. డ్రోన్ ఆధారిత పిచికారీ తో తక్కువ సమయంలో వేగంగా పంట చీడ లను అరికట్టవచ్చునని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సమర్థ్ కార్యక్రమం ద్వారా టైలరింగ్, జుకి, ఎంబ్రాయిడరీ , స్టిచింగ్ లో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తుందన్నారు. ఉపాధి మార్గాలను చూపుతుందని అన్నారు.

వీనిని ఆసక్తి గల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.దేశంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో వికసిత్ సంకల్ప భారత యాత్రలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద కోత్తగా రిజిస్టర్ చేసుకున్న 700 మంది లబ్ధిదారులకు వచ్చే రెండు రోజుల్లో సిలిండర్లు ,రెగ్యులేటర్లు అందించాలని ఆయన పౌర సరఫరాల అధికారులకు సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *