రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపల్లి మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో సీఐ శశిధర్ రెడ్డి ఎస్ఐ రమకాంత్ లు మీకోసం పోలీస్ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, గుడుంబా ఇతర మత్తు పదార్థాలు అలవాటు పడవద్దని, గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నేర నియంత్రణ అదుపులోకి వస్తుందని, అత్యవసరాలకు తప్ప అనవసరాలకు 100 కు కాల్ చేయకూడదని గ్రామంలో మహిళ పట్ల మర్యాదగా ప్రవర్తించాలని రోడ్లపై వాహనం నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనానికి సరైన ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకొని వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
