కొత్త కోట మండలం. సెప్టెంబర్ 22:
శంకర సముద్రం రిజర్వాయర్ లో ముంపునకు గురైన నిర్వాసితులకు అన్ని విధాలుగా అదుకొని తగిన న్యాయం చేస్తామని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తకోట మండలం కానాయపల్లి R&R సెంటర్లో కలెక్టర్, ఎమ్మెల్యే సమక్షంలో నిర్వాసితులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27 న నిర్వాసితులకు డిప్ ద్వారా ప్లాట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బండు కింద 400 మంది నిర్వాసితులకు మొదటి ప్రాధాన్యతగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పారు. డిప్ తీసే రోజున గ్రామస్తులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిర్వాసితుల సమస్యలు ఒక్కోటి పరిష్కరించుకుందాం అందరు ఓపిక కలిగి ఉండాలని సూచించారు.
