
✅ *వినాయక చవితి పందిళ్ళ ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానం.*
✅ *అనుమతులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.*
✅ *ప్రజల వెసులుబాటు కొరకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన.*
✅ *పోలీస్, అగ్నిమాపక, పురపాలక, విద్యుత్ శాఖల నుండి ఏకకాలంలో అనుమతి ఇవ్వడమే సింగిల్ విండో విధానం యొక్క ముఖ్య ఉద్దేశం.*
గ్*కార్యనిర్వాహకులు 7995095800 మొబైల్ నంబర్ కు వాట్సాప్ ద్వారా Hi అని సందేశం పంపిస్తే, విధి విధానాలు రిప్లై వస్తాయి.* *https://ganeshutsav.net అనే వెబ్సైట్ లో కార్యనిర్వాహకుల వివరాలు నింపి సబ్మిట్ చేయాలి.*
ఆఫీసుల చుట్టూ తిరగకుండా, సింగిల్ విండో విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.*
*జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్.,*
జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ఉత్సవ మండపాలు / పందిళ్ళు ఏర్పాటు చేసే ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన వివరాల గురించి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., గారు తెలియజేస్తూ జిల్లా ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
• గతంలో వినాయక మంటపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ, పోలీసు శాఖల నుంచి నిరభ్యంతర (NOC) పత్రం తీసుకోవలసి ఉండేది.
• దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ప్రజల సౌకర్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానమును రూపొందించారన్నారు.
• ఇందులో భాగంగా ప్రజలు “7995095800 మొబైల్ నంబర్ కు వాట్సాప్ ద్వారా Hi అని సందేశం పంపిస్తే చాలు”, నిరభ్యంతర పత్రం కోసం అనుసరించవలసిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా ప్రజల యొక్క మొబైల్ ఫోన్ కు రిప్లై వస్తుందన్నారు.
• ఆ తరువాత ప్రజ https://ganeshutsav.net అనే వెబ్సైట్ లో గణేష్ మంటపం ఏర్పాటు చేయదలచిన కమిటి సభ్యుల వివరాలు, మంటపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీసు స్టేషన్ పరిధి లోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మంటపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయం లో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు సంబంధిత పోలీసు స్టేషన్ ఎస్.హెచ్.ఓ కి వెళ్తుందన్నారు.
• సదరు ఎస్.హెచ్.ఓ ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్ని మాపక శాఖ, విద్యుత్ శాఖల యొక్క సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి మంటపం ఏర్పాటు చేయు ప్రదేశమును సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించి సానుకూలంగా ఉంటే అనుమతికి అవసరం అయిన రుసుము వివరాలు తెలియచేస్తారన్నారు.
• ప్రజలు వారికి దగ్గరలో ఉన్న మీ-సేవ కేంద్రము నందు తగిన రుసుమును చెల్లించి ఆ రసీదును వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన యెడల ఎస్.హెచ్.ఓ వాటిని పరిశీలించి వెంటనే క్యూ ఆర్ కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రం (NOC)ను జారీ చేస్తారన్నారు.
• ఈ నిరభ్యంతర పత్రాన్ని (NOC) ప్రింట్ తీసి గణేష్ మంటపంలో ఉంచవలెను. పోలీసువారు సందర్శన సమయములో క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారని తెలిపారు.
• జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవ మండపాల కార్యనిర్వాహకులు ఈ సింగిల్ విండో విధానాన్ని సద్వినియోగపరుచుకుని కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.ఆకాంక్షించారు.
*గణేష్ మండప నిర్వాహకులు పాటించవలసిన సూచనలు మరియు తీసుకోవల్సిన జాగ్రతలు:-*
• ఉత్సవ విగ్రహాలను రోడ్డుకు అంతరాయం లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.
• కమిటీ సభ్యులు ఆధార్ మరియు చిరునామా లు ఫోన్ నెంబర్ లు తీసుకోవాలి, పూజ దినముల వివరములు తీసుకోవాలి
• వినాయక చవితి మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఉపయోగించరాదని, స్పీకర్లను ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు మాత్రమే వినియోగించాలి.
• ఉత్సవ మండపాలు వద్ద విగ్రహాలకు భద్రతగా కమిటీ సభ్యులు రాత్రులు మండపాలు వద్దనే ఉండాలి.
• వినాయక నిమజ్జనం చేసే సమయాలను మరియు రూట్ మ్యాప్ ను ముందుగా పోలీసు వారికి తెలియ చేయాలి.
• వినాయక నిమజ్జనం ఉపయోగించే వాహనం యొక్క వివరాలు, రికార్డ్స్, డ్రైవరు లైసెన్సు తీసుకోవాలి మరియు మద్యం చేవించి వాహనం నడపరాదు.
• డ్రైవరు వద్ద అండర్ టేకింగ్ లెటర్ తీసుకోవాలి.
• వినాయక చవితి మండపాల వద్ద ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా వాహనాలను ఒక ప్రక్కగా పార్కింగ్ చేసేలాగా ఏర్పాట్లను చేయాలి.
• దీపారాధన సమయం నందు మరియు LED లైట్స్ వెలిగేటప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, మండపాల వద్ద ఇసుక బస్తాలు, నీటి బకెట్లు ఏర్పాటు చేసుకోవాలి.
• వినాయక ఉత్సవ మండపాల వద్ద గాని ఊరేగింపులలో గాని బాణసంచాను ఉపయోగించరాదు.
• వినాయక నిమజ్జనం సమయంలో అశ్లీల డాన్సులను గాని డీజే శబ్దాలు ఎక్కువగా చేయకూడదు.
• ఇతర వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదు.
• బలవంతపు చందాలు, వసూళ్ళు గాని మరియు దర్శనాల టికెట్ల గానీ పెట్టరాదు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే వాటిపై ఫిర్యాదులు చేయుటకు డయల్ 100 కి ఫోన్ చేయగలరు.
ప్రతి మండపానికి వారి సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి ఒక పోలీసును కో-ఆర్డినేటర్ గా నియమించడం జరుగును.
• ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులు ఉపయోగించిన విగ్రహాలను పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఉపయోగించరాదని మరియు మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఉపయోగించవలెనని సూచన.
గ్హుడీ రాత్రి పుట మండపం లో ఉంచ రాదు.కమిటీ సభ్యులు రాత్రి సమయంలో మండపం వద్ద కాపలాగా ఉండాలి, నిర్వాహకులు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
మండపాలు ఉండే ప్రదేశం వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు.. విగ్రహాల దగ్గర వాహనాలు పార్కింగ్ చేయరాదు.నిమజ్జనం నిర్దేశించిన సమయములో ఊరేగింపు ప్రారంభించి, నిర్ణీత సమయంలో నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే నిమజ్జనము చేయవలెను.నిమజ్జనం రాత్రి 10 గంటల లోపు ముగించాలి.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేయడమైనది.విగ్రహం వద్ద పాయింట్ బుక్ మరియు రిజిస్టర్ ఉండాలి.





