రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబద్ మండల కేంద్రానికి చెందిన పిల్లి చంద్రవ్వ(58)అనే వృద్ద మహిళ కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపానికి గురై ఈ రోజు మధ్యాహ్నం అందజ 01:00 గంటల ప్రాంతంలో ముస్తాబద్ లోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దుకగా అది చూసిన ఒక వ్యక్తి బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ బాలాశ్రీనివాస్ కు ఫోన్ ద్వారా తెలియజేయగా వెంటనే బాలాశ్రీనివస్ స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని సదరు వృద్ద మహిళలను కాపాడి ముస్తాబద్ మండల కేంద్రంలోని పీపుల్స్ ఆసుపత్రికి తరలించడాం జరిగింది.ఎస్.ఐ శేఖర్ చంద్రవ్వ కుటుంబ సబ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి చంద్రవ్వ ను వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం జరిగింది.
సకాలం లో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన ముస్తాబద్ బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ బాలా శ్రీనివాస్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.




