రెవెన్యూ డివిజన్ సాధనకై ఈనెల 29న సడక్ బంద్
జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి
సెప్టెంబర్ 22
సిద్దిపేట జిల్లా మద్దూరు : చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 29న తలపెట్టిన సడక్ బందును విజయవంతం చేయాలని జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జేఏసీ నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ గత కొన్ని సంవత్సరాలుగా చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూలమిట్ట మండలాల ప్రజలు అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈనెల 29న ముస్త్యాల జాతీయ రహదారి సెంటర్ వద్ద మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు జరిగే సడక్ బందు కార్యక్రమానికి మండల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జేఏసీ నియోజకవర్గ నాయకులు అందె అశోక్, రామడుగు బాలరాజు, బియ్య రమేష్, ఈరి భూమయ్య, పుల్లూరు రాజు, జంగిలి యాదగిరి, బొప్ప నాగయ్య, సుంకోజు శ్రీశైలం, ఎండి. ఖాజా, బియ్య సంపత్,లక్కపల్లి సత్తయ్య, బొమ్మ లింగం, ఏలూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.





