రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడప కడపకు వెళ్లి ప్రచారం నిర్వహించాలని నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి శుక్రవారం అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లను గ్యారంటీ కార్డును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ప్రభుత్వం నెరవేర్చని హామీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
రైతులకు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ మహిళలకు ప్రియాంక గాంధీ డిక్లరేషన్ ఎస్సీలకు మల్లికార్జున్ ఖర్గే డిక్లరేషన్ ప్రజలకు వివరించాలన్నారు అలాగే గ్యారెంటీ కార్డులోని ఆరు అంశాలను ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపలనే అమలు పరుస్తామని ప్రజలకు తెలియజేయాలన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారని వారి వద్దకు కార్యకర్తలు వెళ్లాలన్నారు.
ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ నాయకులు సూడిద రాజేందర్ బిపేట రాజు సంతోష్ గౌడ్ చెన్నిబాబు కొత్తపల్లి దేవయ్య రఫీక్ వంగ మల్లారెడ్డి గంటబుచ్చా గౌడ్ పాల్గొన్నారు
