వర్గల్ మండల్ సెప్టెంబర్ 21:రక్త దానం ఇతరులకు పునర్జన్మ. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.
వర్గల్,రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ ఆధ్వర్యంలో రెడిన బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో వర్గల్ మండలంలోని తునికి ఖాల్స గ్రామంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ అధ్యక్షులు బాబు గౌడ్ మాట్లాడుతూ.. రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయొచ్చని ఈ సందర్భంగా తెలిపారు. రక్తదానం రక్తదానాన్ని చేసిన ప్రతి ఒక్కరిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు రక్తాన్ని దానం చేయాలన్నారు. రోటరీ క్లబ్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్, షూస్ ను ఉచితంగా పంపిణి చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ రక్త దాన శిబిరంలో సుమారు 50 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెంబెర్ అట్రాక్షన్ చైర్మన్ చంటి, వాటర్, శానిటేషన్ చైర్మన్ కర్ణాకర్ రెడ్డి, పూర్వ అధ్యక్షులు డాక్టర్ పురుషోత్తం, జగదీశ్వర్, డిసిసిబి డైరెక్టర్ అంజిరెడ్డి, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.




