కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు.
మంచిర్యాల జిల్లా.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మరియు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ఆదేశానుసారం మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. అనంతరం విజిత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచి,ప్రజలను మోసం చేసింది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని తెలిపారు. కాంగ్రెస్ బాకీ కార్డు నిజం, కాంగ్రెస్ గ్యారంటీలు అబద్ధం అని అన్నారు. ప్రజలందరూ నిజం వైపు నిలబడి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ గెలవాలి అని, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హాజీపుర్ మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, పెద్దంపేట మాజీ ఎంపీటీసీ జాడి వెంకటేష్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.





