Breaking News

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌

148 Views

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని అమెరికా లో నిర్మించి ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా 19 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. మేరీల్యాండ్‌లోని అకోకీక్‌ నగరంలో 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్ లో భాగంగా ఈ విగ్రహాన్ని నిర్మించారు.
ఈ స్మారక చిహ్నం అంబేడ్కర్‌ బోధనలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సమానత్వం, మానవ హక్కులకు చిహ్నంగా దీన్ని చూస్తున్నట్లు ఏఐసీ వివరించింది. ‘‘స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’’గా నామకరణం చేసిన ఈ విగ్రహాన్ని అక్టోబరు 14న ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాతో పాటు ప్రపంచ ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఏఐసీ తెలిపింది. ప్రముఖ విగ్రహ రూపశిల్పి రామ్ సుతార్‌ ఈ విగ్రహాన్ని రూపొందించారు. గతంలో ఆయన గుజరాత్‌లోని సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని కూడా డిజైన్‌ చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *