దౌల్తాబాద్: పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా గర్భవతులు, తల్లులు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎంపీటీసీ ఆది వనిత వేణుగోపాల్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసోత్సవంలో భాగంగా గర్భవతులు, తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదగిరి, అంగన్వాడీ టీచర్లు సరోజ, రాధిక తదితరులు పాల్గొన్నారు…




