( తిమ్మాపూర్ సెప్టెంబర్ 21)
తిమ్మాపూర్ మండలం మన్నేంపల్లి గ్రామానికీ చెందిన బీనపల్లి రాజు ఇటీవలే అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో అడ్మిట్ కాగా వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మేల్యే డా రసమయి బాలకిషన్ లక్ష రూపాయల ఎల్ఓసి చెక్కును వారి కుటుంసభ్యులకు బుధవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు..
బాధిత కుటుంబ సభ్యులకు సహాయం చేసినా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో మన్నెంపల్లి ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్, కోలకాని సాయిలు, ఆశోధా సురేష్,బినపల్లీ సారయ్య,అనిల్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు