దౌల్తాబాద్: స్వచ్ఛతతోనే వ్యాధులు ప్రబలవని సర్పంచ్ అప్ప వారు శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా తడి పొడి చెత్త నిర్వహణ, కంపోస్ట్ తయారీ, ప్లాస్టిక్ నిర్మూలన పై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హంసకేతన్ తదితరులు పాల్గొన్నారు….
