సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 21(TS24/7 తెలుగు న్యూస్):నిరుపేదలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ , సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని సర్పంచ్ యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామానికి చెందిన కేశపూరం వనజ అనారోగ్యo తో హాస్పిటల్ లో చేరగా అధిక ఖర్చులు నిమిత్తం సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సీఎం ఆర్ యఫ్ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ.12,000 వేల రూపాయలు మంజూరైన చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. సీఎం సహాయ నిధికి సహకరించిన సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,రాష్ట్ర యఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటుగా పోకల రాంచంద్రం, రాగుల యాదగిరి, అన్నెమైన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.