ప్రాంతీయం

నవవధువు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

10 Views

సమాజ సేవలో మ్యాకల కనకయ్య సేవలు అభినందనీయం – సర్పంచ్ భవాని బాలకిషన్,ఉప సర్పంచ్ సుధాకర్

సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మర్కుక్ మండల అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నారని నరసమ్మ శరదయ్య కుమార్తె నవవధువు సుప్రియ వివాహానికి పుస్తే మెట్టెలు అందజేసిన, బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవ చేయడంలో తృప్తి ఉంటుందని, ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలని అన్నారు, నూతన వధూవరులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు, అనంతరం గ్రామ సర్పంచ్ భవాని బాలకిషన్, ఉప సర్పంచ్ జుట్టు సుధాకర్ మాట్లాడుతూ మ్యాకల కనకయ్య ముదిరాజ్ సేవలు అభినందనీయమని, తన వద్దకు వచ్చిన వారికి అండగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, బంగారం ధర కొండెక్కిన తన మంచితనాన్ని చాటుకుని నవవధువుకు పుస్తె మెట్టెలు అందజేయడం సంతోషం అని అన్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పిట్ల మహేష్, యూత్ అధ్యక్షులు బోయిని మురళి,వార్డ్ సభ్యులు, బోయిని మల్లేష్, దండు కరుణాకర్, లక్ష్మీ కరుణాకర్ నీరుడి రాజు మన్నే నరేష్ మల్లేష్ వెంకటేష్ కనకయ్య ఆంజనేయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *