ప్రాంతీయం

రెవిన్యూ డివిజన్ వెంటనే ప్రకటించాలి

98 Views

మాజీ ఎంపీపీ డాక్టర్ జాడి రామరాజు నేత

 

 

ములుగు జిల్లా,సెప్టెంబర్ 21

 

ఏటూరు నాగారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వరంలోముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం కు ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ ఎంపీపీ జాడి రామరాజు నేత మాట్లాడుతూ 2018 ఎలక్షన్ లో నాటి టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రివర్యులు అజ్మీర చంద్రులాల్ ములుగు జిల్లా మరియు ఏటూరు నాగారం రెవిన్యూ డివిజన్ చేస్తామని చెప్పినారు కానీ జిల్లా చేశారు కానీ ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ చేయకపోవడం బాధాకరమని అన్నారు అదేవిధంగా 2019 స్థానిక ఎన్నికల్లో గా గెలవడం కోసం ఏటూర్ నాగారం అభ్యర్థిగా కుసుమ జగదీష్ జెడ్పీటీసీగాగెలిస్తే ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పి ఆదివాసి దళిత బహుజన వర్గాల ఓట్లతో జెడ్పీటీసీగా గెలిచారు కానీ ఏటూరు నాగారం ప్రజలను రెవెన్యూ డివిజన్ చేయకుండా మోసం చేశారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ డివిజన్ ప్రకటించే విధంగా చూడాలని అన్నారు ఒకవేళ ప్రకటించకపోతే టిఆర్ఎస్ పార్టీకి ప్రాంతంలో తగిన బుద్ధి చెప్పక తప్పదని అన్నారు. అలాగే ఆదివాసి దళిత బహుజన వర్గాల అభివృద్ధి కోసం టిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ప్రకటించే విధంగా చూడాలని అన్నారు అదేవిధంగా ఏటూరు నాగారం రెవిన్యూ డివిజన్ తో పాటు రాజుపేట మండలాన్ని కూడా ప్రకటించాలని అన్నారు. ఆదివాసి దళిత బహుజన వర్గాల అభివృద్ధి కోసం ఆలు బాగా పేరూరు మండలాలుగా ప్రకటించాలని ఉన్నారు ఒకవేళ ఎడల 27 28 తారీకు రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోతే బిఆర్ఎఫ్ పార్టీ నాయకులను ఏటూరు నాగారం మంగపేట కన్నాయిగూడెం తాడ్వాయి వాజేడు వెంకటపురం మండలాలలో గాని గ్రామాలలో గాని ఎక్కడికక్కడ నిలదీస్తామని అన్నారు. టిఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ప్రకటించాకే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏజెన్సీ ప్రాంతాలైన మండలాల్లో గ్రామాలలో తిరగాలని అన్నారు. ఒకవేళ ఏటూర్ నాగారం రెవిన్యూ డివిజన్ ప్రకటించకుండా గ్రామాలలో తిరుగుతే ఎక్కడికక్కడ నిలదీస్తామని అన్నారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి గద్దల హరిబాబు, మండల ఉపాధ్యక్షులు కర్ణ సంపత్, బిసి మోర్ష అధ్యక్షులు అధ్యక్షులు చిట్టమొట శీను, గిరిజన మోర్చా అధ్యక్షులు బతకయ్య, యువ మోర్చా అధ్యక్షులు చక్రి కిషన్ మోర్ షా అధ్యక్షులు ఎలంధర్ రెడ్డి, శక్తి కేంద్రాల ఇన్చార్జ్ ఆయురాల జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *