తల్లుల సన్నిధిలో మంత్రులు
తెలంగాణ క్రాంతి,తాడ్వాయి, సెప్టెంబర్ 21
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర గిరిజన మహిళ శీశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపనలు చేశారు.
గురువారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సత్యవతి రాథోడ్, జెడ్పి చైర్మన్ బడే నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐటిడిపిఓ అంకిత్ ఎస్పీ గౌస్ ఆలాం, డి ఎఫ్ ఓ రాహుల్ జాదవ్, ల తో కలిసి సమ్మక్క సారలమ్మలను దర్శిం చుకున్నారు.మేడారం ప్రధాన పూజారులు దేవదాయ శాఖ అధికారులు డోలు వాయి ద్యా లతో ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తులాభారం నిర్వహించి తల్లులకు నిలువెత్తు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం మేడారంలో నూతనంగా నిర్మించే అతిథి గృహం దేవదాయ శాఖ నిధులతో 2 కోట్ల 15 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించే అతిథి గృహ భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఐటీడీఏ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో మేడారం మహా జాతర 2024 జరిగే జాతర అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లా డుతూ మేడారం మహా జాతర నిర్వాహనపై అని శాఖల అధికారులను సమన్వయం చేసినట్లు తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి మేడారం జాతరకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
గత జాతర నిర్వహణలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేశామన్నారు.వచ్చే జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధి కారులు ప్రణాళికబద్ధంగా మంజూరైన అభివృద్ధి పనులు ప్రారంభించి పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు.గత జాతర వివిధ శాఖ అధికారులు ప్రజాప్రతిని సహాకారులతో నిర్వహించిన అనుభవం ఉంది అన్నారు.
ములుగులో బస్టాండు నిర్మా ణం కోసం 11 కోట్ల రూపా యలు మంజూరు చేస్తా మన్నారు.ఈసారి జాతరకు కూడా 75 కోట్లు కు తగ్గకుండా ప్రతిపాదన రూపొందించమని తెలిపారు.ఎన్నికలు సమీపి స్తున్న నేపథ్యం లో ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు లోపాలు లేకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మేడారం మహా జాతర ఈ జిల్లా అధికారులకు టాస్క్ లాంటిది అన్నారు. జిల్లా లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని గుర్తు చేశారు.2024 ఫిబ్రవరి మాసం లో జరిగే మేడారం మహా జాత ర అభివృద్ధి పనులు అక్టోబర్ మాసంలో ప్రారంభించి నాణ్యత ప్రమాణాలతో చేయాలని సూ చించారు.తాత్కాలిక ప్రాతిపది కన ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిం చారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి పుష్కరాలకు మేడారం మహా జాతరకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేశారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొన్నిచోట్ల రోడ్లు ధ్వంసమైన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.ఈ జిల్లాపై ఐటి శాఖ మంత్రి దృష్టి పెట్టారని గుర్తు చేశారు.ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్త మైన అధికార యంత్రాంగాన్ని ఈ సందర్భంగా మంత్రి అభి నందించారు.రోడ్డు భవ నాల శాఖ పంచాయతీ రాజ్ శాఖ వారికి మంజూరైన అభివృద్ధి పనులు జిల్లా కలెక్టర్ ఆధ్వ ర్యంలో జరగనున్నాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర నిర్వహణలో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ ద్వారా 15 కోట్లు అంచనాలతో ఒక కోటి 50 లక్షల అంచనా లతో డార్మెంటరీ హాల్ 94 లక్షలు అంచనాలతో పూజా మందిరం పోలీస్ క్యాంపు కార్యాలయం అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొం దించమన్నారు.జాతర విజ యవంతనికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని మంత్రి సందర్భంగా సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ మేడారం అభివృద్ధి పనుల వివరాలు వెల్లడించారు.
ఇటీవల భారీ వర్షాలు వల్ల ధ్వంసమైన పనులను రోడ్ల అభివృద్ధి కోసం మంజూరైన పనులను అక్టోబర్ మాసంలో ప్రారంభిస్తామని తెలిపారు.
జాతర నిర్వాహణపై ప్రణాళిక బద్ధంగా అన్ని శాఖల వారి సమన్వయంతో బడ్జెట్ రూపకల్పన జరిగిందని తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.