*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*మతసామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా పండుగలను నిర్వహించుకోవాలి*
*పండుగల సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వదంతులను “(పుకార్ల)” ను నమ్మరాదు : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,*
బక్రీద్ పండుగను రామగుండం కమీషనరేట్ ప్రజలంతా సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) తెలిపారు.
ఈ సందర్భంగా రామగుండం కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల ప్రజలకు రేపు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్బంగా కమీషనరేట్ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మసీదులు,దర్గాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బందోబస్త్ విధులకు హాజరయ్యే అధికారులకు,సిబ్బందికి దిశా నిర్దేశం చేశామన్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా గత 15 రోజులుగా చెక్పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాల తనిఖీలు చేపట్టి ఆవుల అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఆకస్మిక తనిఖీలను నిర్వర్తిస్తూ అక్రమ రవాణా జరగకుండా నివారిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు తెలియజేశారు. కమీషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు మరియు సిబ్బంది మొత్తం బక్రీద్ బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా అభ్యంతరకర పోస్టులు వచ్చిన ప్రజలు అట్టి పోస్టులను చూసిన వెంటనే ప్రతిస్పందించకుండా, సంయమనం పాటిస్తు అట్టి పోస్టుల్లో నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని, సామాజిక మాధ్యమంల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని వాటిని ముందుగా ఎటువంటి సమాచారం తెలిసినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలి అని లేదా డయల్ – 100కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పోస్ట్ చేసిన ,ఫార్వార్డ్ చేసిన వారితో పాటుగా గ్రూప్ అడ్మిన్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు.
