ఆసక్తిగా తిలకించిన గ్రామ ప్రజలు..
(తిమ్మాపూర్ మే 20)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చిరుతల రామాయణం నాటకం మూడు రోజులగా కొనసాగుతుంది. తొలి రెండు రోజులు దశరథుడు, కౌసల్య, కైక, సుమిత్ర, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రజ్ఞుడు, విశ్వామిత్రుడు,రావణాసురుడు తాటకి,శుభాభుడు, మారీసుడు, రాక్షసులు,ఆంజనేయుడు, సుగ్రీవుడు,వాలి,అంగదుడు, పాత్రలు ఆకట్టుకున్నాయి. మూడవరోజు సోమవారం ఆంజనేయుడు లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చి రాముడికి వివరిస్తాడు. అనంతరం రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వారధి నిర్మించి వారద సైన్యంతో లంకకు బయలుదేరి యుద్ధం చేసి రావణాసురుని ఓడించి సీతమ్మను శర నుండి విడిపించుకుని అయోధ్య కు తీసుకు వచ్చే నటన ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి..
తొలి రెండు రోజులు లాగానే మూడో రోజు కూడా నటన చూడడానికి భక్తులు, గ్రామ ప్రజలు అదిక సంఖ్యలో తరలివచ్చి చిరుతల రామయణ నాటకాన్ని ఆసక్తిగా తిలకించారు..
మంగళవారం ఉదయం రాముడికి పట్టాభిషేకం చేస్తామని చిరుతల రామాయణం కమిటీ తెలిపారు..