బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో అనిల్ మొగిలి.
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 29)
సిద్దిపేట జిల్లా,గజ్వేల్:
వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్, పల్లవి ప్రశాంత్ ని,తన స్వగృహం కోల్గుర్లో మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించిన అనిల్ మొగిలి.
ఈ సందర్భంగా అనిల్ మొగిలి మాట్లాడుతూ, గజ్వేల్ నియోజకవర్గం నుండి సాదరణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి , ఆసామాన్య రీతిలో శ్రమించి కళా రంగంపై ఉన్న మక్కువతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన పల్లవి ప్రశాంత్ కి అభినందనలు తెలిపారు..
ఇకపై భవిష్యత్తులో గజ్వేల్ కళాకారులు అందరు కూడా ఎదిగే విధంగా తమ వంతు ప్రోత్సాహం ఉంటుందని పల్లవి ప్రశాంత్ తెలియజేశారు.
పల్లవి ప్రశాంత్ చాలా సౌమ్యుడు కల్మషం లేని వ్యక్తి ఎదిగే కొద్ది ఒదిగి ఉండే స్వభావం కలవాడు అని, బయట ఎంతో మంది ప్రశాంత్ గురించి రకరకాలుగా మాట్లాడిన అతని యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పది అన్నది కలిసి మాట్లాడితే తెలుస్తుంది అని, అనిల్ మొగిలి అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు మహేష్ తేజ్ , శ్రీకాంత్ బూరుగుపల్లి,రమేష్, సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
