ప్రాంతీయం

మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే

162 Views

అభివృద్ధిలో నిడుమునూరు మండల కేంద్రాన్ని అగ్రభాగంలో ఉంచుత:- ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్

ప్రజాప్రతినిధులతో కలిసి బైకుపై వాడవాడ కలియతిరిన ఎమ్మెల్యే, ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

నిడమనూరు ఆర్టీసీ బస్టాండ్ పరిశీలన చేసిన ఎమ్మెల్యే

బస్టాండ్ లో ప్రయాణికుల కు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ

అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిడమనూరు మండల కేంద్రంలో ఓపెన్ జిమ్, మినీ స్టేడియం ఏర్పాటుకు స్థల పరిశీలన చేశాడు

నిడమనూరు మండల కేంద్రంలో చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించాడు

అనంతరం ఆయన మాట్లాడుతూ నిడమనూరు మండల కేంద్రంలో చెరువును మినీ ట్యాంక్ బండ్ చేసేందుకు ఆరేళ్ల క్రితమే నిధులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం జానారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం ట్యాంక్ బండ్ పనులను ప్రారంభించలేదు నిడమనూరు మండల కేంద్రం వెనుకబాడుతనానికి జానారెడ్డి కారణం ఇక్కడ ప్రజలు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో జానా విఫలమయ్యారని తెలిపారు. నిడమనూరు మండల కేంద్ర అభివృద్ధి పట్ల జానారెడ్డి సవితి తల్లి ప్రేమను ప్రదర్శించారు

బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే నిడమనూర్ అభివృద్ధి ప్రారంభమైందన్న ఎమ్మెల్యే నిడమనూరు మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా

నాకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సమానమే

నాగార్జునసాగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తా నిడమనూర్ మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు కోరకు స్థలాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమం లో మండల ఎంపీపీ బొల్లం జయమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు తాటి సత్యపాల్,గౌరవ ఎంపీపీ సలహాదారు బొల్లం రవి,మార్కెట్ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, మండల యూత్ అధ్యక్షుడు వున్నం భాస్కర్,దేవాలయం చైర్మన్ లు లింగప్ప, మేరెడ్డి వెంకట్ రమణ, మండల సీనియర్ నాయకుడు బొల్లం సైదులు,మండల కో -అప్షన్ మెంబర్ SK సలీం,మండల SC సెల్ అధ్యక్షుడు అల్లంపల్లి నరేష్,నిడమానూర్ పట్టణ అధ్యక్షడు దాసు,మహిళ అధ్యక్షురాలు కళావతి,PT రాజు,సర్పంచులు అల్లం శ్రీను,ఎంపీటీసీ భాస్కరి నారాయణ,నాయకులు,కొండలు,ఈశ్వర్,భాస్కర్,ఉపేందర్, వేణు, శివ మరియు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *