ప్రాంతీయం

సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందించాలి

212 Views

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాలని సిపిఎం సీనియర్ నాయకులు కత్తిలింగారెడ్డి, శాఖ కార్యదర్శిలు మలికంటి చంద్రశేఖర్, పాలోజు సుదర్శన్ లు ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని ముకుందాపురం గ్రామంలో అధికార పార్టీకి చెందిన బిఆర్ఎస్ నాయకులు, గ్రామ సర్పంచ్ ఏకపక్షంగా అధికార పార్టీ కార్యకర్తలకే, గృహలక్ష్మి పథకం, బీసీ బందు, దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలకు ఎంపిక చేయడం సరి కాదని వారన్నారు. రాజకీయాలకతీతంగా అర్హులైన నిరుపేదలను చూసి ఎంపిక చేయాలని, వారు కోరారు. ఎన్నికల కోసం ఓట్ల కోసం మాత్రమే కాకుండా నిజంగా ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి గృహలక్ష్మి పథకం మంజూరు చేస్తే ఉపయోగం ఉంటుందని, ఆర్థికంగా వెనకబడినటువంటి ఎస్సీ, బీసీ నిరుపేదలకు దళిత బంధు బీసీ బందు మంజూరు చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది గాని ఇలా రాజకీయాలకు ప్రభుత్వ సంక్షేపతకాలను వాడుకుంటే నిజంగా ఆరులైన పేదలు పేదలుగానే మిగిలిపోవాల్సి వస్తుందని వారన్నారు. నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక చేసి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ కార్యకర్తల సంక్షేమానికి వాడుకుంటే అర్హులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లెంకలపల్లి శ్రీనివాస్, విశ్వనాధం, సిరిసనవాడ రాములమ్మ, బైరోజు సైదమ్మ, వంగాల జానమ్మ, వంగాల లక్షమమ్మ,గజ్జి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *