సెప్టెంబర్ 21
తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట అయిన చంద్ర బాబు పక్షాన టిడిపి చేస్తున్న న్యాయ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని వివిధ జాతీయ పార్టీల నేతలు ప్రకటించారు ఢిల్లీలో ఉన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను బుధవారం హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా బీఎస్పీ ఎంపీలు కున్వర్ డానిష్ ఆలీ రితీష్ పాండే పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతిమ న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు టిడిపి చేస్తున్న ధర్మపోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు





