రాజకీయం

ఎల్లారెడ్డిపేటలో కొండ లక్ష్మణ్ వర్ధంతి

133 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పద్మశాలి సేవా సంఘం లో సంఘ అధ్యక్షుడు వనం రమేష్ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకల్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమానాలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పద్మశాలీలు మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత తెలంగాణ సాధనకై పోరాడినటువంటి యోధుడు పద్మశాలి ముద్దుబిడ్డ స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నీ పురస్కరించుకొని ఆయన చేసిన త్యాగాలని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు వనం రాజు,ఉపాధ్యక్షుడు దోమల భాస్కర్,కార్యదర్శిసుంకి భాస్కర్, డాక్టర్ వనం ఎల్లయ్య,గాజుల దేవదాసు,గోశిక దేవదాసు,దుస శ్రీనివాస్,శ్రీరామ్ సుదర్శన్, సుంకి సత్యనారాయణ, వనం చంద్రమౌళి,వల్లకాటి సిద్ధిరాములు. తదితరులు పాల్గొన్నారు….

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *