ప్రాంతీయం

మహిళా రిజర్వేషన్ బిల్లు ఘనత కవిత దే.. 30 ఏళ్ల పోరాటం ఫలించిన వేళ… చట్టసభల్లో పెరుగనున్న మహిళా శక్తి.. మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి రజిత గౌడ్..

98 Views

మహిళా రిజర్వేషన్ బిల్లు ఘనత కవిత దే..30 ఏళ్ల పోరాటం ఫలించిన వేళ…చట్టసభల్లో పెరుగనున్న మహిళా శక్తి..మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి రజిత గౌడ్..

భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోరాటంతోనే 30 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా డిమాండ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఢిల్లీ గడ్డపై చేసిన పోరాటం తో మోక్షం కలిగింది. 33 శాతం మహిళా బిల్లు ఆమోదం తో చట్ట సభల్లో ఇక నుంచి మహిళా శక్తి పెరగబోతుంది అని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆరో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి రజిత గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని మూడు దశాబ్దాల క్రితం నుంచే ఉద్యమం నడుస్తోందన్నారు. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో అప్పటి దేవెగౌడ సారధ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఆ తర్వాత వచ్చిన వాజ్ పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టినా ఆమోదముద్ర పడలేదన్నారు. రాజ్యసభలో 2010లో ఆమోదం పొందిన 2014లో లోక్ సభ రద్దు కావడంతో ఆ బిల్లు మురిగిపోయిందన్నారు ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంగా మహిళా బిల్లు పై చేస్తున్న పోరాటం వల్ల మహిళలకు దేశ చరిత్రలో సమున్నత గౌరవం దక్కింది.మహిళలు తమ సమస్యల పై గళం విప్పే రోజు వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు గురించి తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించి మహిళల కోసం ఆనాడు పోరాటం చేశాడు.ఆస్పూర్తి ఇప్పుడు కవిత ఢిల్లీలో పోరాటం చేసి మహిళ రిజర్వేషన్ బిల్లు వచ్చేలా వివిధ పార్టీలను కలుపుకొని ఢిల్లీ వేదికగా గళం విప్పిన కవిత డాటర్ ఆఫ్ ఫైటర్ కెసిఆర్ ఉద్యమ పోరాట స్ఫూర్తి కలిగి తండ్రికి తగ్గ తనయ కవిత మహిళలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *