Breaking News

భువనగిరి జిల్లాలో కల్తీ

204 Views

భువనగిరి జిల్లాలో కల్తీ పాల తయారీదారులు ఇద్దరు అరెస్టు.

 

భువనగిరి జిల్లా సెప్టెంబర్ 20:

కల్తీ పాలు తయారు చేస్తున్న గృహాలపై పోలీసులు దాడి చేసి తయారీకి వాడే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల భీమనపల్లి గ్రామాల్లో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది స్థానిక ఎస్‌ఐ విక్రంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం భీమనపల్లి గ్రామానికి చెందిన కప్పల రవి కల్తీపాలను విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు రవి ఇంటిని తనిఖీ చేశారు.

ఈ మేరకు అతని వద్ద 350 లీటర్ల కల్తీ పాలు 100 మిల్లీమీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ 2 డోలోఫర్ సిమ్డ్ మిల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు అలాగే కనుముకుల గ్రామంలో కుంభం రవి ఇంటి వద్ద వంద లీటర్ల కల్తీ పాలు 200 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ 2 డోలోఫర్ సిమ్డ్ మిల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు కల్తీ పాలను పరీక్షల నిమిత్తం ల్యాబరేటరీకి పంపించామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *