మంచిర్యాల జిల్లా.
జైపూర్ ఆర్ ఐ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు రమేష్ ఆరోపణ.
తేది:20,మే,2025 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్ లో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు రమేష్ మాట్లాడుతూ జైపూర్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపించారు.పట్టా పాస్ బుక్ ఉండి అన్ని అర్హతలు ఉన్న కూడా ఎంక్వయిరి రిపోర్ట్ లు అర్హులకు కాకుండా అనర్హులకు అనుకూలంగా ఇస్తూ రెవెన్యూ వ్యవస్థ మీద ప్రజలకు ఉన్న నమ్మకం పోయే విదంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా విద్యార్థుల విద్యాబ్యాసానికి అవసరమైన సర్టిఫికేట్స్ విషయంలో బీద విద్యార్థులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని గంగారపు రమేష్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జైపూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి పై సమగ్ర విచారణ జరిపి అతనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.లేని పక్షంలో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.శేఖర్, ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





