చైనా మాంజ దుకాణం పై
సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ దాడి నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా,జనవరి 10, తెలుగు న్యూస్ 24/7
సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం నిషేధించిన ప్రమాదకరమైన చైనీస్ మాంజాను విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక దుకాణంపై పోలీసులు దాడి నిర్వహించారు.తనిఖీల్లో భాగంగా సుమారు 35 చైనీస్ మాంజా రోల్స్ (గల్లాలు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న సిద్ధిపేట పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు (ముద్దాయిలను) 1) ఆగమాలు రాజేష్ @ చింటూ , 2) మహేశ్వరం నాగరాజు, 3) సుతారీ శేఖర్, పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.పక్షులకు, జంతువులకు వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగించే చైనీస్ మాంజాను విక్రయించినా లేదా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, పర్యావరణానికి ప్రాణాలకు హాని కలిగించని సాధారణ దారాన్ని మాత్రమే వాడాలని సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలియజేశారు.





