మాజీ ఎంపీపీ డాక్టర్ జాడీ రామరాజు నేత
తెలంగాణ క్రాంతి,ఏటూర్ నాగారం, సెప్టెంబర్ 20
ఏటూర్ నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ డాక్టర్ జాడీ రామరాజు నేత మాట్లా డుతూ కాంగ్రెస్ నాయకురాలకు ములుగు ఎమ్మెల్యేకు ఏటూరు నాగారం రెవిన్యూ డివిజన్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అన్నారు.అదేవిధంగా మైదాన ప్రాంత నాయకురాలు కాబట్టి మల్లంపల్లి మండలం కోరింది కానీ ఏజెన్సీ ప్రాంతంలోని రాజు పేటని కానీ ఆలుబాకని పేరూరి ని మండలాలుగా కోరకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్ప టికైనా కాంగ్రెస్ పార్టీ నాయకు రాలకు ఏటూరు నాగారం రెవిన్యూ డివిజన్ కావాలని కోరడం శుభసూచకమే కానీ ఎలక్షన్స్ కోసం ఆదివాసి దళిత బహుజన వర్గాల ఓట్ల కోసం ప్రజల్ని మభ్య పెట్టడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లెటర్ఇచ్చినట్టు ఉన్నది కానీ రెవెన్యూ కావాలని పూర్తిగా ఇచ్చినట్టు లేదని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయ కులకు ఏటూర్ నాగారం మండలం కేంద్రాన్నిరెవెన్యూ డివిజన్ ప్రకటించాలంటే మేము నేను చేసే నిరాహార దీక్షలో పార్టీలకతీతంగా పాల్గొని విజయంతంచేయాలని కోరుతు న్నాం ఇప్పటికైనా ఆదివాసి దళిత బహుజన వర్గాల వారి అభివృద్ధి కోసం రెవెన్యూ డివిజన్ కావాలి కోసం మద్దతు ఇవ్వకుంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలను భూస్థాపితం చేయ డం కోసం ఏటూరునాగారం మంగపేట తాడ్వాయి వాజేడు వెంకటపురం కన్నాయిగూడెం మండల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఏటూరు నాగారం రెవిన్యూ డివిజన్ మరియు బస్ డిపో పునర్ని ర్మాణం కాకుండా అడ్డుకున్నది కానీ స్థానిక ఎన్నికల్లో గెలవడం కోసం కన్నాయిగూడెం మండ లానికి శ్రీరాముని గుడులు కట్టిస్తానీ కాంగ్రెస్ పార్టీ నాయ కులు చెప్పి మోసం చేశారు అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అబద్ధం చెప్పదు నిజం మాట్లా డదు అని అన్నారు.మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల కోసం ఏటూర్ నాగారం కన్నాయి గూడెం తాడ్వాయి మంగపేట మండలాలలో గ్రామాలలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెపుతారాని మాజీ ఎంపీపీ డాక్టర్ జాడీ రామరాజు నేత అన్నారు.