రాజకీయం

ఇమాంపూర్ లో సొంత గూటికి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు

263 Views

తూప్రాన్: నవంబర్ 15
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

సిఎం కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో ఫ్యాక్స్ డైరెక్టర్ ముత్యాలు, అశోక్ లతో పాటు మరో పది మంది నాయకులు కార్యకర్తలు బుధవారం ఉదయం తూప్రాన్ జడ్పీటిసి బస్వన్నగారి రాణి సత్యనారాయణ గౌడ్, తూప్రాన్ మండల బి.అర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భగవాన్ రెడ్డి, ఇమాంపూర్ ఉప సర్పంచ్ బక్క సత్యనారాయణ గౌడ్ ల అధ్వర్యంలో బి.అర్.ఎస్ పార్టీ లో చేరారు. సోమవారం బిజెపి గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ సమక్షంలో బిజెపి పార్టీ లో చేరిన ఫ్యాక్స్ డైరెక్టర్ ముత్యాలు అశోక్ లతో పాటు మరో పది మంది నాయకులు కార్యకర్తలు గర్ వాపస్ తో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే గా గెలిచి మరో సారి సిఎం కావాలని అందుకు ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే విధంగా భారీ మెజార్టీ తో గెలిపించుకుంటామని అన్నారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గం లి తూప్రాన్ మండలం ఉండడం మా అదృష్టం అని అన్నారు. సిఎం కేసీఆర్ తన సొంత నియోకవర్గమైన గజ్వేల్ అభివృద్ధికి కంకణం కట్టుకొని చేసి చూపించాడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సిఎం గా హ్యాట్రిక్ విజయం సాధించి మరో చరిత్ర సృష్టిస్తాడు మన సారు అని కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ ను గెలిపించాలని కోరారు. సిఎం కేసీఆర్ ముందుచూపు తో రైతుల పక్షపాతిగా అకుంఠిత దీక్షతో సాహసోపేతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి సాగు నీరు అందించిన అపర భగీరథుడు అని అన్నారు. అలాంటి నేతను మరింత పురోగతి కై కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తో కేసీఆర్ ను గెలిపించాలని కోరారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *