ప్రాంతీయం

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..

79 Views

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..

సిద్దిపేట పోలీస్ కమిషనర్ఎస్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్..

సిద్దిపేట జిల్లా,ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (ఏ )నుండి (ఎఫ్ ) 22 (2) (ఏ) & ( బి), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 నో ఐ ఎక్స్ ఫాస్లి సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం ఫిబ్రవరి 7 ఉదయం 6:00 నుండి ఫిబ్రవరి 22 ఉదయం 6 గంటల వరకు ఆమలులో ఉంటుంది. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి, బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వాళ్ల పై చట్టపరంగా చర్యలుతీసుకుంటాము.శాంతిభద్రతలపరిరక్షణనిరంతరంశ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలుసహకారంఅందించాలని సూచించడమైనది.సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగం పైనిషేధాజ్ఞలు ఫిబ్రవరి 7 ఉదయం 6 గంటల నుండి ఫిబ్రవరి 22 ఉదయం 6 గంటల వరకు ఆమలులో ఉంటుంది. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7(1) 2016, యాక్ట్, సెక్షన్ 55 డి బి (ఏ), 45 డి బి (ఏ), 65డి బి (ఏ), 30 పోలీస్ యాక్ట్ 1861, రూల్ నెంబర్ 8 నోస్ పొల్యూషన్, (రెగ్యులేషన్ & కంట్రోల్) రూల్స్ 2000 ప్రకారం పోలీస్ కమిషనర్ఈమేరకుఉత్తర్వులు జారీ చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి అధికారుల అనుమతి పొందాలనిసూచించదమైనది. పై నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగించే వాళ్ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 223 బి ఎన్ ఎస్, సెక్షన్ 70(ఏ), 70(బి) 70 సీ, 76, సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి సెక్షన్ 76, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైనది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *