పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ
జిల్లా ఎస్పి గౌష్ ఆలం
ములుగు జిల్లా ,కన్నాయి గూడెం,సెప్టెంబర్ 20
ములుగు జిల్లాలోని కన్నాయి గూడెం పోలీస్ స్టేషన్ ను బుధవారం జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు.తనిఖీలో భాగంగా స్టేషన్లోని రికార్డ్స్ ను తనిఖీ చేసి కేసుల నమోదు వాటి యొక్క స్థితి గతులను ఎస్సై సీఐలను అడిగి తెలుసుకుని తగు సూచనలను సలహాలను అందించారు. స్టేషన్ లోని ఆయుదాలను వాటి యొక్క నిర్వహణ భద్రత వంటి అంశాలను పరిశీలిం చారు.పోలీస్ స్టేషన్ యొక్క పరిసరాలను పరిశీలించిన ఎస్ పి భద్రత కోణంలో మరింతగా చర్యలు చేపట్టాలని అదేశిం చారు.ఫిర్యాదుదారులు వచ్చినప్పుడు వారికీ కనీస సౌకర్యలను సమాకూర్చాలని వారికీ కనీస భరోసా కల్పించి వారి ఫిర్యాదు పట్ల వెంటనే చర్యలు చేపట్టాలని అదే శించారు.ఈ కార్యక్రమంలో ఏ ఎస్పి సిరిశెట్టి సంకీర్త్,సిఐ మండలం రాజు,ఎస్ఐ సురేష్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.