పాములపర్తి లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థిగా దుబ్బాసి సుమలత, మహేష్
సిద్దిపేట జిల్లా, మర్కుక్, డిసెంబర్ 5
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దుబ్బాసి సుమలత, మహేష్ బరిలో నిలిచిన శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించాలని మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని కోరారు, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని,ప్రజల ఆదరణ మాకే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.





