ప్రాంతీయం

ఎం ఆర్ పి ఎస్  మరియు అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

60 Views

 

ఎం ఆర్ పి ఎస్  మరియు అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ 

హైదరాబాద్ – ఫిబ్రవరి 27

ఎస్సీ వర్గీకరణలో జరిగిన లోపాలు , చేయాల్సిన సవరణల మీద చర్చించేందుకు ( ఎం ఆర్ పి ఎస్ ) మరియు అన్ని అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లోని డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అతిథులుగా వెంకటేష్ నేత, డా. పృథ్వి రాజ్ యాదవ్, సయ్యద్ ఇస్మాయిల్, హోలియ దాసరి వెంకటేష్ , జానకి రామయ్య చౌదరి, వేల్పుల సూరన్న పాల్గొన్నారు.ఎస్సీ వర్గీకరణలో అందరికి న్యాయం జరిగేలా , మాదిగలకు రావాల్సిన తగిన వాటా సాధించుకునేల భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం మీద ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చ జరుగుతుంది.ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ అధ్యక్షత వహిస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్రా బిక్షపతి మాదిగ సమన్వయం చేశారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టీవీ నరసింహ మాదిగ స్వాగత ఉపన్యాసం చేశారు.హైదరాబాద్ జిల్లా నేతలు ఇటుక శ్రీ కిషన్ , డప్పు మల్లిఖార్జున్ , రవి, అరుణ్, ఇంకా మరికొంత సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సమావేశ నిర్వహణలో పాలుపంచుకున్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298