ప్రాంతీయం

నెమలి పింఛాలతో గణనాథుడి ప్రతిష్ట

184 Views

దౌల్తాబాద్ ;మండల కేంద్రమైన చందూర్ లో శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణనాథుడిని నెమలిపింఛాలతో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా శివాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా గణనాథుడిని వినూత్న రీతిలో ప్రతిష్టించడం జరుగుతుందని తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం గవ్వలతో గణనాథుడు గత సంవత్సరం పగిలిన కొబ్బరికాయ చిప్పలతో మట్టి గణనాథుడిని ప్రతిష్టించామన్నారు. ఈ సంవత్సరం నెమలిపింఛాలతో గణనాథుని ప్రతిష్టించడంతో ఆయా గ్రామాల ప్రజలు గణనాథుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేసి యూత్ సభ్యులను అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సుజిత్ రెడ్డి గౌరీష్, సాయి తేజ, గంగ ప్రసాద్, నవీన్, బన్నీ రెడ్డి,సృజన్, సాయికుమార్, తేజ, హరీష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *