కొండా లక్ష్మణ్ బాపూజీ బాటలో ధర్మ సమాజ్ పార్టీ
కర్రోళ్ల రవిబాబు రాష్ట్ర కార్యదర్శి
సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 27
కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహారాజు సారధ్యంలో తెలంగాణ గడ్డమీద బీసీ ఎస్సీ ఎస్టీల స్వరాజ్య సాధనే ధ్యేయంగా పనిచేస్తుందని కొండా లక్ష్మణ్ బాపూజీకి అనగారిన వర్గాల రాజ్యాధికారమే ఘనమైన నివాళిగా ధర్మ సమాజ్ పార్టీ భావిస్తుందనీ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోళ్ల రవిబాబు న్యాయవాది అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ ప్రారంభ కాలము నుండి కొండా లక్ష్మణ్ బాపూజీ కలలుగన్న రాజ్య స్థాపన కొరకు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను రాజ్యాధికారం కోసం చైతన్యం చేస్తూ రాబోయే రోజుల్లో ఆ వైపుగా నిర్మాణం చేస్తామని దానిలో భాగంగానే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అగ్రకులాలతో తలపడటానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సదన్ మహరాజ్ రాష్ట్ర నాయకులు జ్యోతి జిల్లా నాయకులు చందు, యాదగిరి,బుగ్గరాజు,ప్రసన్న సురేష్,నందు,ఎల్లయ్య,షఫీ తదితరులు పాల్గొన్నారు
