ప్రాంతీయం

జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరాలి – బిజెపి

45 Views

కొమరం భీం జిల్లా

*దేశ సమైక్యత కోసం పాటుపడదాం*

*బిజెపి ఆధ్వర్యంలో గోలేటిలో జాతీయ జెండాల పంపిణీ*

*ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి*

*బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్*

కొమరం భీమ్ జిల్లా, రెబ్బెన మండలం, గోలేటిలో బిజెపి ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ  పిలుపు మేరకు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ హర్ ఘర్ తిరంగా పంద్రాగస్టున త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగర వెయ్యాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్  అన్నారు దేశ స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన నాయకులను వీరులని స్మరించుకొని దేశ ఐక్యత కోసం ప్రతీ ఇంటిపైన జెండా ఎగరవేయాలని బంగ్లాదేశ్ లో మైనార్టీ లైన హిందువులపై దాడులు మారణ హోమం హత్యలు. అత్యాచారాలు ఆపాలని హిందువులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి జగన్నాథ ఓధెలు, పోలింగ్ బూత్ అధ్యక్షులు దుర్గం వసంతరావు, ఆటో యూనియన్ అధ్యక్షులు బోగారపు ప్రతాప్, లావుడియా సుబ్బారావు గుల్బం శ్రీనివాస్, ఎర్రం మల్లేష్ , బూడిద గోపాలకృష్ణ నామాల సుధాకర్సుధాకర్, అశోక్ రావు, కోట ప్రభాకర్, నాగభూషణం, మలిశెట్టి పోశయ్య, బూసి పోశం, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్