ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 28, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వం మరో అడుగు వేయబోతోంది. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయాలని ప్రైవేటు స్కూళ్లు, విద్యాసంస్థల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత రవాణా వసతిని కల్పించడానికి బస్సులను అందుబాటులోకి తీసుకుని రావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ అధ్యయనం చేస్తోంది. అన్నీ కుదిరితే- ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ తరహా వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రావచ్చని తెలుస్తోంది. ఆడపిల్లలకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రయాణించుటకు ఆర్టీసీ వీలు కల్పించింది మరియు ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు మగ పిల్లలకు బస్సులు ఫ్రీ బస్సు పాస్ ఇస్తున్నది టెన్త్ క్లాసు గానీ ఇంటర్మీడియట్ కానీ ఉన్న పిల్లలకు రాయితీ నుంచి బస్ పాసు ఇస్తున్నది బస్సులోని సౌకర్యాలను సద్వినియోగం చేసుకో నుటకు భావించగలరని ఆర్టీసీ తరఫునుంచి కోరింది సిరిసిల్ల డిపో డిసి డిఎం ఆదేశానుసారము చీకోడు గ్రామానికి చేరుకొని సర్పంచ్ ఆధ్వర్యంలో సమర్పించిన సందర్భం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సుధాకర్ రెడ్డి , జిల్లా సహాయక కార్యదర్శి బాధనరేష్, ఎంపిటిసి ఆంజనేయులు, వార్డ్ మెంబర్ ఉరడి రాజు, ఆర్టీసీ యాజమాన్యం, గ్రామస్తులు పాల్గొన్నారు.




