(గన్నేరువరం సెప్టెంబర్ 19)
ఇంకుడు గుంతలో పడి నాలుగేండ్ల బాలుడు మృతిచెందిన ఘటన గన్నేరువరం మండలం యస్వాడ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..గువ్వ సంధ్య,తిరుపతిల కుమారుడు సాజన్ {అలియాస్} కన్నయ్య (3) మంగళవారం ఇంటి బయట ఆడుకుంటూ ఎదురుగానే గ్రామపంచాయితి ముందు ఊన్న పబ్లిక్ వాటర్ ట్యాంక్ ఇంకుడు గుంతలో పడి బాలుడు మృతిచెందాడు.
ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా కనబడపోయేసరికి తల్లిదండ్రులు ఇండ్ల చుట్టూ వెతికారు.
అయినా బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో అనుమానం వచ్చిన బాలుడి తాత ఇంకుడు గుంతలో దిగి వెతికేసరికి బాలుడి మృతదేహం లభ్యం అయింది.
బయటకు తీసి గన్నేరువరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందాడు.
తల్లిదండ్రుల,ఇతర కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.ఇంకుడు గుంత తవ్వి ఏండ్లు గడుస్తున్నా దానిపై ఎలాంటి కప్పు లేకపోవడంతో అధికారుల నిర్లక్ష్యంతోనే తమ కొడుకు చనిపోయాడంటూ మృతుని తండ్రి తిరుపతి వెల్లడించారు.