ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరిన యువకులు, మహిళలు
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే, సుడా చైర్మన్
(తిమ్మాపూర్ సెప్టెంబర్ 17)
తిమ్మాపూర్ మండలం లోని పలు గ్రామాలకు చెందిన 500 మంది కాంగ్రెస్, బీజేపీ యువకులు, నాయకులు, మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆదివారం నుస్తూలపూర్ గ్రామం లో బీఆర్ఎస్ పార్టి తిమ్మాపూర్ మండల అధ్యక్షడు రావుల రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..
కేసీఆర్ అద్భుతమైన పాలన, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై బీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ..
పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. కేసీఆర్ అభివృద్ధి పితామహుడని, తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతిపథంలో అగ్రగామిగా నిలిపిన దార్శనిక పాలకుడని పేర్కొన్నారు. ప్రతి పల్లెకూ అభివృద్ధి ఫలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. అనంతరం ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వాజామెంతారు గ్రామంలో వార్డ్ నెంబర్ గెలవని కవ్వంపల్లి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా ఓడగోట్టి అతనే గెలుస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమి అభివృద్ధి చేసారో ఒక్కసారి చెప్పాలన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేని అభివృద్ధిని తోమ్మిదేళ్లలో కేసీఆర్ సహకారంతో నేను మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపించానని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు…
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, నుస్తూలపూర్ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, ఉపసర్పంచ్ బేతి శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.