బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్లో పెట్టాలని బీసీల ధర్మపోరాట దీక్ష.
మంచిర్యాల జిల్లా.
ఈరోజు బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తానందున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ముందు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మపోరాట దీక్షను చేయడం జరిగింది. దీక్షకు ముందుగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు పూలమాల వేసి బీసీ జేఏసీ నాయకులు కు బీసీ జేఏసీ జిల్లా కుల సంఘాల నాయకులు సంగెపు ఎల్లయ్య, వైద్య భాస్కర్, రాజేశం గౌడ్, పూల మాలలు వేసి దీక్షను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా కో – ఆర్డినేటర్ ఒడ్డేపల్లి మనోహర్,జాతీయబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీసీజేఏసీ జిల్లా నాయకులు నిలకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిబంధనలకు అనుకూలంగా బీసీ రిజర్వేషన్లకు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను తీసుకొని రావడం జరిగింది. కానీ కొంతమంది అగ్రకుల నాయకులు బీసీల రిజర్వేషన్లను సహించలేక తెలంగాణ హైకోర్టుకు పోవడం జరిగింది. కావున బీసీలకు రావలసిన రిజర్వేషన్లను అడ్డుకోవడం మూలంగా స్థానిక సంస్థలలో బీసీలకు రావాల్సిన 42 % రిజర్వేషన్ రాకుండా పోవడం వల్ల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మపోరాట దీక్షను చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు బీసీల రిజర్వేషన్ పైన చిత్తశుద్ధిగా వ్యవహరించాలని, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతూ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం , ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతుగా పార్లమెంటులో చట్ట సవరణ చేసి , 9 షెడ్యూల్లో పెట్టి బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లను అందించాలని బీసీ జేఏసీ డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బీసీ ప్రజలు ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు బీసీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పోరాటాలకు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం , అఖిలపక్ష కమిటీని ఎన్డీఏ ప్రభుత్వం నడిపిస్తున్న బీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకుపోవాలని బీసీ జేఏసీ కోరడం జరిగింది. దశాబ్దాల కాలంగా జరుగుతున్న బీసీ రిజర్వేషన్ పోరాటం తుది దశకు చేరిందని ఈ పోరాటాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలని లేనిపక్షంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ ప్రజలందరి చేత తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమాలను చేయడానికి బీసీ జేఏసీ సిద్ధంగా ఉందని పేర్కొనడం జరిగింది.
ఈ బీసీల ధర్మ పోరాట దీక్షలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు కర్రే లచ్చన్న,కట్కోజుల రమణ,యాదబోయిన రాజన్న యాదవ్, సంగేపు ఎల్లన్న , వైద్య భాస్కర్, దేవసాని నాగరాజు, దుర్గం రాజేశం గౌడ్, ముదిగుంట కిష్టయ్య,కొండిల్ల శ్రీనివాస్, కుందారపు రవి, మార్త మారుతి, శ్రీనివాస్ గౌడ్, గుత్థుల రాంబాబు, ఆడెపు గణేష్,వేముల మల్లేష్ బీసీ జేఏసి మహిళా జిల్లా నాయకులు వనజ,లక్ష్మి, బీసీ స్టూడెంట్ నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.





