
జగదేవపూర్ మండలములోని అలిరాజ్ పేట్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.అలిరాజ్ పేట గ్రామంలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక సర్పంచ్ లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీటీసీ రమ్య రవి కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, ఉప సర్పంచ్ రమేష్ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, బహ్మచారి, వార్డు సభ్యులు అనిత,రజిని,పద్మ,కార్యదర్శి శ్రీనివాస్, వైద్య సిబ్బంది గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.




