కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామ్ హనుమాన్ నగర్ గ్రామంలో ఇతర పార్టీలకు చెందిన 100 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ కండువాలు కాపీ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో మానకొండూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మానకొండూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కవ్వంపల్లి సత్యనారాయణ భారీ మెజార్టీతో గెలిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ , నాయకులు రెడ్డిగాని రాజు తదితరులు ఉన్నారు.