ప్రాంతీయం

కృతజ్ఞతసభ ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు…

62 Views

ముస్తాబాద్,ఆగస్టు26, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పాటుపడిందని, టీఆర్ఎస్‌ను మళ్లీ గెలిపించాలని బిఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో సభ ఏర్పాటుచేసి ముస్తాబాద్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కృతజ్ఞత సభలో సంతోష్ రావు మాట్లాడుతూ.. నాడు సమైక్యాంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఎండిన వాగులు వంకలు చెరువులతో  పచ్చనిచెట్ల వాసనలు అరుదుగా కనిపిస్తూ మోడు బారి పోయింది కానీ నేడు తెలంగాణ స్వరాష్ట్రంలో  సీఎంకేసీఆర్ పాలనలో ఎండా కాలంలో కూడా చెరువులు మత్తల్లు దుంకుతూ కనుచూపు మేర ఎటు చూసినా ప్రశాంతమైన రోడ్లు రోడ్లకు ఇరుపక్కన పచ్చని వనాలను తలపించేలా వృక్ష సంపద గణనీయంగా పెరిగిందని అన్నారు. ఒకవైపు సంక్షేమం మరొకవైపు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తూ ప్రజల ఆరోగ్యం లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతూ హరితహారం వంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సత్ఫలితాలను సాధిస్తూ అన్ని రంగాలలో ఒక సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది దేశంలోనే  సీఎంకేసీఆర్ ప్రత్యేక ప్రాముఖ్యతను సాధించారని రాష్ట్రంలో ఏప్రభుత్వం చేయని విధంగా విద్యాభివృద్ధికి పాటు పడిందన్నారు. అదేవిధంగా సీనియర్ నాయకురాలు దబ్బెడ రేణుక, గుర్రాల రమేష్ రెడ్డి, చెవుల మల్లేశం, ఎండి.నవాజ్ పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గాని ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ గురుకుల విద్యాలయాలు, రెడిడెన్షియల్‌ పాఠశాలలు, సంక్షేమ హస్టళ్లు, ఆదర్శ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పేదవిద్యార్థులకు ఉన్నత చదువులకోసం పాటు పడుతున్నారన్నారని అంతేకాకుండా  అంగన్‌వాడీలు, హస్టల్‌లలో సన్నబియ్యంతో పౌష్టికాహారం ఆసరా పింఛన్లు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *